సిరా న్యూస్,విజయవాడ;
నగరంలోని కండ్రిక, బోస్ నగర్,జర్నలిస్టు కాలనీ మంత్రి నారాయణ లో సుడి గాలి పర్యటన చేసారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ పర్యటించారు. నిన్నటివరకూ వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుధ్య కార్మికులతో జరుగుతున్న క్లీనింగ్ పనులను పరిశీలించారు. జర్నలిస్టు కాలనీలో నిల్వ అన్న వరద నీటిని భారీ మోటార్ లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులు పరిశీలించారు.
నారాయణ మాట్లాడుతూ విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయింది. రెపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయి. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉంది. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్ లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నాం. డ్రైన్ లలో ఉన్న సిల్ట్ తొలగింపు కూడా వేగంగా జరుగుతుంది. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కొన్నిచోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారు. అలాంటి చోట్ల మరోసారి ఎన్యుమరేషన్ చేయమని అధికారులను అదేశించాము.వరద నీరు బయటకి వెళ్లేందుకు నున్న రోడ్డు,బై పాస్ రోడ్డు,100 అడుగుల రోడ్డులో చాలా చోట్ల గండ్లు కొట్టాం. గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్ లు వేయాలని అధికారులకు సూచించాము. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టు లు నిర్మిస్తామని అన్నారు.