సిరా న్యూస్,హైదరాబాద్;
అమీర్ పేటలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. బల్కంపేట లో నూతన అంగన్ వాడి భవనం ప్రారంభోత్సవం జరిగింది. ధరం కరణ్ రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను. తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్ నగరంలో ప్రజా పాలన దిశగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని అన్నారు.