సిరా న్యూస్,హైదరాబాద్;
ముషీరాబాద్ లో గృహ జ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ జీరో బిల్లింగ్ ను మహిళలకు అందించారు.
మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ,500 కే గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామనిమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురషెట్టి తదితరులు పాల్గోన్నారు.