Minister Ponnam Prabhakar: రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

సవాళ్లను అధికమించి ముందుకు సాగుతాం…

-రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, అయినప్పటికీ కూడా అన్నింటిని అధిగమించి ముందుకు సాగుతామని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల లంబాడి పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం పురోగమిస్తుందని ఆయన వెల్లడించారు. గ్రామాలలో పంచాయతీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, గ్రామీణ వ్యవస్థ బాగుంటేనే ప్రజలు బాగుంటారని అన్నారు. గ్రామపంచాయతీ సర్పంచుల ముందు పెను సవాళ్లు ఉన్నవని ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా సర్పంచుల బాధలు ఉన్నాయని అన్నారు. వారు చేసిన పనులకు బిల్లులు రాక అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు, అప్పులు చేసి ఆస్తులు కూడబెట్టుకున్నారే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. సర్పంచ్ లు ఎవరు కూడా అధైర్య పడవద్దని తాము అండగా ఉండి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థలపై అధికారులు, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ ఉండాలని, గ్రామాలలో శానిటేషన్ , మొక్కల పెంపకం, మౌలిక సదుపాయాలు కల్పన, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి, జెడ్పిటిసి గీకుర్ రవీందర్, వైస్ ఎంపీపీ బేతి రాజీ రెడ్డీ, సర్పంచ్ నాగేల్లి వకుల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఈఈ రవి ప్రసాద్, ఎంపీడీవో ఎం నరసయ్య, ఎమ్మార్వో నరేందర్, ఎంపిఓ శ్రవణ్, కార్యదర్శి శ్రావణ్ కుమార్, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *