సిరాన్యూస్, భీమదేవరపల్లి
రుద్ర హోమం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర హోమం నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని, ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ, రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర హోమంలో పాల్గొన్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రాంబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కొరతూ 27 రోజుల స్వామివారి నక్షత్ర దీక్ష మాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్నారని, మంత్రితోపాటు మరో 120 మంది స్వాములు దీక్ష మాలను స్వీకరించారన్నారు. వీరభద్ర స్వామి వారి కటాక్షంతో ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు.