సిరా న్యూస్, కరీంనగర్:
రాజన్న సేవలో మంత్రి పొన్నం…
కరీంనగర్ జిల్లాలో ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా వేములవాడ రాజన్న ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వచనం గావించి, ప్రసాదాన్ని అందించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈవో కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు.