భీమదేవరపల్లి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని చంటయ్యపల్లి, మల్లారం, రసూల్ పల్లి, గట్ల నర్సింగాపూర్, ముల్కనూరు గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలకు తెలంగాణ రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందకు వందశాతం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, అభివృద్ధి దశలవారి కార్యక్రమని ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ జక్కుల అనిత, ఎంపీడీవో భాస్కర్, ఎమ్మార్వో భాస్కర్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…