సిరాన్యూస్, భీమదేవరపల్లి
చేనేత కార్మికులకు అండగా నిలవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
* ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ చౌరస్తాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత కార్మికులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్పొరేషన్ కు నిధులు కేటాయించి చేనేత కార్మికులకు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తిలో శిక్షణ నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు చేనేత వస్త్రాలను ధరించి చేనేత పరిశ్రమను ఆదరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి సైతం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు.