సిరా న్యూస్,హుస్నాబాద్;
పోతారం ఎస్ లోని ఆర్ కే జిన్నింగ్ మిల్లు మీర్జాపూర్ రోడ్డు పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,అధికారులు పార్టీ ముఖ్య నేతలుపాల్గొన్నారు.. మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది.కాటన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యవేక్షణ లో దేశ వ్యాప్తంగా కాటన్ కొనుగోలు చేస్తున్నారు.పత్తి మద్దతు ధర పత్తి కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయి.మౌలిక వసతుల కల్పన అడ్మినిస్ట్రేషన్ సహకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.కాటన్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని నా దృష్టికి వచ్చింది.కేంద్రంలో ఉన్న మన రాష్ట్ర ప్రతినిధులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 322 పత్తి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించాలి.
ఎక్కడ కూడా రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకి విజ్ఞప్తి చేస్తున్న.అన్ని రకాల మౌలిక సదుపాయాలు రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలు క్రయ విక్రయాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు పెంచాలి.సెప్టెంబర్ వరకు పత్తి కొనుగోలు కొనసాగుతుందిరైతులు ఎవరూ తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు.పత్తిలో తేమ శాతం 8 లోపు ఉంటే 7500 ధర ఉంటుందిపత్తిమీర సంచులలో నింపుకు రావద్దు ఓపెన్ గా ఆటోలో, ట్రాక్టర్, వ్యాన్ లో తీసుకురావాలి
తేమ శాతాన్ని పాటించి ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలి.హుస్నాబాద్ ప్రాంతంలోని అన్ని సెంటర్లలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. ధాన్యం పత్తి కొనుగోలు కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగద్ధని అన్ని రకాలుగా పర్యవేక్షణ జరుగుతుందని చెప్పా.తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఎన్ని కేంద్రాలు ఓపెన్ అయ్యాయి ఎంత కొనుగోలు జరుగుతుందో వాటిని మానిటరింగ్ జరుగుతుంది.
స్థానిక నాయకత్వాన్ని కోరుతున్న మీ గ్రామంలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన ప్రభుత్వ అధికారులతో చర్చించండి.
రైతులకు ఇబ్బంది కలిగితే మీదే బాధ్యత.రైతులకు మద్దతుగా ఉండాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.
వరి ధాన్యాన్ని సంబంధించి ఇప్పటికే కొనుగులు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. కోనుగోలు వేగంగా జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల దగ్గర సేకరించిన వడ్ల పేరు మీద 20 వేల కోట్ల విలువైన ధాన్యం ఇవ్వక డబ్బు కట్టక పెండింగ్ లో ఉంది.
ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల కేటాయింపు జరగలేదు.జీరో డ్యూ ఉండి ప్రభుత్వానికి మంచిగా చెల్లించిన వారి కేటాయింపు జరుగుతుంది.మిల్లర్ల కేటాయింపు తో పాటు 60-70 శాతం మంచిగా చేసి వారికి 10 శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి అవకాశం ఇస్తున్నాం.డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపు చేయడం లేదు.మిల్లు కేటాయించలేదు అనే పేరు మీద ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆగదు,పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం.