సిరాన్యూస్,భీమదేవరపల్లి
నక్షత్ర దీక్ష మాల విరమణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి
* ఆలయంలో మొక్కులు చెల్లింపులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాల విమరణ చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.తన తల్లితో కలిసి పూజలో పాల్గొని దీక్ష విరమణ చేశారు. స్వాములతో కలిసి కాసేపు నృత్యాలు వేశారు. అనంతరం కొత్తకొండ గుట్టపై ఉన్న స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి కాలినడకన గుట్టపైకి ఏక్కారు. పాడి, పంటలు సమృద్ధిగా పండి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దీక్షను తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తానే స్వయంగా గుట్ట పైకి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని, గుట్ట పైకి వెళ్లడానికి భక్తులకు అవసరమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారని, మరొక్కసారి ముఖ్యమంత్రిని దేవాలయానికి తీసుకువచ్చి దేవాలయాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకుంటానన్నారు.