సిరా న్యూస్,హుజురాబాద్;
హుజురాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకొని కరీంనగర్ వెళ్తున్న మార్గమద్యంలో మాన కొండూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యాన్ని ప్రదర్శించారు.. వెంటనే తన కాన్వాయ్ ను ఆపి గాయపడ్డ వ్యక్తి పరిస్థితి సిబ్బంది తో కలిసి పరిశీలించారు.. అంబులెన్స్ కి వచ్చేలోపు తన వాహనంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు..అనంతరం గాయపడ్డ వ్యక్తి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. గాయపడ్డ వ్యక్తి నీ ఆసుపత్రికి తరలించిన తరువాత మంచి వైద్యం అందించాలని డాక్టర్లతో సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు
=================