సైదాపూర్ లో మంత్రి పొ్న్నం పర్యటన

సిరా న్యూస్,కరీంగనర్;
హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెంకేపల్లి – సైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసారు. సైదా పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో 18 పనులకు 75 లక్షల విలువైన నిర్మాణాలకు శంఖు స్థాపన చేసారు. కిచెన్ షెడ్లు ,టాయిలెట్ల నిర్మాణం , ఓపెన్ జిమ్ తో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ,జిల్లా ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ సైదాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. ఈ నియోజకవర్గం ప్రత్యేక ప్రాధాన్యత తో పనులు అన్ని పూర్తి చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వచనం ఎమ్మెల్యే గా గెలిచా. పార్టీ లో సీనియర్ కావడం వల్ల మంత్రి ని అయ్యా. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులూ ఉన్న నాకు చెప్పవచ్చు. పార్టీ సీనియర్ ఎంతగా బిజీ గా ఉన్న నియోజకవర్గ సమస్యల పై ఏమి ఉన్న చెప్పవచ్చు. కరీంనగర్ లో ఉన్న మండలాల విషయంలో కూడా కలెక్టర్ పనులు చేపించాలి. వేసవి కాలం లో నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. కాంగ్రెస్ రాగానే వర్షాలు రాకుండా కరువు కు కారణం కాంగ్రెస్ కాదు. సెప్టెంబర్ లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నీళ్ల సమస్య ఊర్లలో రావద్దని అన్నారు.
వాళ్ళు ఏమి అడిగిన చేయండి.. ఒక్క బిందె పట్టుకొని బయటకు వచ్చే సమస్య రావద్దు. నీళ్ల సమస్య రాకుండా నియోజకవర్గానికి 3.5 కోట్లు తీసుకొచ్చాం. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి పాఠశాలల సమస్యలు తెలుసు. కిచెన్ ,టాయిలెట్స్ పూర్తి చేయాలి. హుస్నాబాద్ లో ఉన్న ఏ పాఠశాల కి ఎం కావాలన్న పరిష్కరిస్త. విద్యా కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. సాగు నీరు సమస్యను కూడా పరిష్కరిస్తం. వాటర్ ఫ్యుర్ ఫైడ్ ప్లాంట్ పెడతాం. ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్స్ పూర్తి కావాలి.. సీఎస్ఆర్ ఫండ్స్ ,బలవికాస వారితో కూడా మాట్లాడం. మీరు ఈ నియోజకవర్గం పోయిన మీ గౌరవం పెంచుతా అని చెప్పా. ఇప్పుడు ఎక్కడున్నా మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అని చెబుతారు. విద్యార్థి నాయకుడు నుండి కష్టపడుతున్న. ఆసుపత్రి నుండి హైదరాబాద్ లో మనిషిని పెట్టినా. వాళ్ళు ఎలాంటి ఆసుపత్రి ప్రాబ్లమ్స్ ఉన్న సాల్వ్ చేస్తారు. గత ప్రభుత్వం లాగా కేంద్రంతో కోట్లా డే వాళ్ళం కాదు..వాళ్ల దగ్గర నిధులు తీసుకొస్తాం. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రంలో కేంద్రం సహకరించాల్సిందే. ప్రజా సమస్యలపై కిందికి దిగి మీ సమస్యలు పరిష్కరిస్తా. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాలల మరమత్తులు పూర్తి చేయాలి. ఆర్టీసి లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం ,ఇందిరమ్మ ఇళ్లు ,500 కే గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. నిన్న ఒక నేత ఆల్రెడీ ఉన్న కులాల కార్పోరేషన్ ల కోసం ధర్నా చేశారు..ముందు ఆయన తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ బస్సులు లేవో అక్కడ సమస్య పరిష్కరిస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *