సిరా న్యూస్,చిత్తూరు;
మహిళా దినోత్సవం సందర్భంగా నగరి నియోజకవర్గంలో మహిళా టీచర్లకు చీర జాకెట్టు స్వీట్ బాక్స్ తో పాటు వాళ్ళు కోరుకున్న ఆహారాన్ని రోజా వడ్డించారు. అంతే కాకుండా
ఈ మీటింగ్ కు హాజరుకానిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని టీచర్ల గ్రూపుల వాట్సాప్ లలో ఆదేశాలను జారీ చేసారు. అంగనవాడి కార్యకర్తలకు ఆశ వర్కులకు స్వీట్,గిఫ్ట్ బాక్స్ లను అందజేశారు. పుత్తూరు మండలంలో గోవిందమ్మ గుడి వద్ద రోజా భర్త ఆర్కే సెల్వమణి కులానికి సంబంధించిన మొదలియార్ వర్గానికి విందు భోజనాలతో పాటు చీర జాకెట్ ఇస్తూ తన భార్యను మరో పర్యం గెలిపించాలంటూ కోరారు. రో జా కులానికి సంబంధించిన వన్నెకుల క్షత్రియరెడ్డి వర్గానికి సంబంధించి వారికి పుత్తూరు మండలం నేసనూరు వద్ద కళ్యాణ మండపం కట్టిస్తానని భూమి పూజ చేసి వారిని కూడా కోరారు. నగరి నియోజవర్గంలోని బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన 118 బ్రాహ్మణులను పిలిపించి వారికి కూడా తాయిలాలు అందజేశారు. అదేవిధంగా నగిరి నియోజకవర్గంలోని ఒక వర్గానికి సంబంధించిన మీడియా మిత్రులను పిలిచి కుటుంబ సమేతంగా వెళ్లిన విలేకరులకు పట్టు వస్త్రాలు చీరజాకెట్టు గిఫ్ట్ బాక్స్ అందజేశారు. గత వారం రోజుల నుండి నగిరి నియోజకవర్గం లోని అనేక కుల సంఘాల అయితే నేమి ఉపాధ్యాయ వర్గాలు అయితేనేమి అంగన్వాడి వర్కర్లు అయితేనేమి సామాజిక కుల సమీకరణల భాగముగా కొన్ని కులాలకు కళ్యాణ మండపాలను కొన్ని కులాలకు మంత్రి ఆర్కే.రోజా హామీలిస్తున్నారు.