సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆర్టీసీని అన్ని రకాలుగా ఆదుకుంటాం…
– మంత్రి సీతక్క
+ ఆదిలాబాద్ బస్‌డీపోలో 6 లహరీ బస్సులు ప్రారంభం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని బస్ డీపోలో కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ లహరీ బస్సులను అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం, కాంగ్రేస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.