ఆదిలాబాద్, సిరా న్యూస్
రేపు ఇంద్రవెల్లికి పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రాక
ఫిబ్రవరి 2 న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సి మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జితో పాటు అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలన్నారు. రేపు ఉదయం 11 గంటలకు పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు.మంత్రి సీతక్క అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.