సిరా న్యూస్, ఆదిలాబాద్:
సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
సీఎం హోదాలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు ఫిబ్రవరి 2న వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌష్ అలం, ఐటీడీఏ ఇన్ చార్జి పీవో కుష్బూ గుప్తా, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం ముందుగా నాగోబా ను దర్శించుకున్న అనంతరం ఎలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులతో మంత్రి సమీక్షించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.