Minister Seethakka: న్యాయవాది అజయ్‌ ఆఫీస్‌ను సందర్శించిన మంత్రి సీతక్క

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

న్యాయవాది అజయ్‌ ఆఫీస్‌ను సందర్శించిన మంత్రి సీతక్క
– ప్రస్తుత రాజకీయాలపై చర్చ
– రాజ్యాంగం ప్రమాదంలో ఉందని వ్యాఖ్య
– కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రముఖ్య న్యాయవాది, కాంగ్రెస్‌ నాయకులు అజయ్‌ జోండలే కార్యాలయాన్ని సందర్శించారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రంలోని కార్యాలయానికి వెళ్లి, ఆయనతో ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల గురించి కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బీజేపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కరువైందన్నారు. ప్రసుత్తం రాజ్యంగం తీవ్ర ప్రమాదంలో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే, రాజ్యంగాన్ని మార్చడం ఖాయమని విమర్శించారు. కాగా ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలంత శక్తివంచన లేకుండా పనిచేయాలని, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పనిచేయాలని సూచించారు. అనంతరం న్యాయవాది అజయ్‌ మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని న్యాయవాది అజయ్‌ మంత్రికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క, కాంగ్రెస్‌ పార్టి బోథ్‌ అసెంబ్లీ ఇంచార్జీ ఆడె గజేందర్, ఏఎంసీ మాజీ చైర్మెన్‌ ఆడె శీల, నాయకులు పైక్‌రావ్‌ ఆనంద్, కాంగ్రెస్‌ పార్టి మండల అధ్యక్షులు అంకత్‌ రవి, నాయకులు మల్యాల కరుణాకర్, మాధవ్‌ మస్కే, నాగ్‌నాథ్, జాంటీ, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *