రాజన్న ను దర్శించుకున్న మంత్రి సీతక్క

 సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండలంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ,కెటిఆర్ కు అధికారం పోయిన తర్వాత మైండ్ పని చేయడం లేదనీ, విధ్వంస రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారనీ ఆరోపించారు. అధికారం లేకుండా కెటిఆర్, కెసిఆర్ ఉండలేకపోతున్నారనీ, మీ అహంకారమే మీ ఓటమికి కారణమని, తొమ్మిదేళ్లు గడిలలో ఉండి పరిపాలన చేశారని, ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యే గెలిచిన ప్రమాణ స్వీకారం చేయడం లేదనీ విమర్శించారు. కేటీఆర్ కు నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకనీ, ప్రజలు మావైపే ఉన్నారనీ, మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారనీ ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారనీ, సర్పంచుల ఇవ్వాల్సిన వేల బిల్లులు పెండింగ్ పట్టింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇవ్వరనీ, కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయాలని హితువు పలికారు. రాజన్న మా ఇలా వేల్పు.. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నామని,బి అర్ ఎస్ ప్రభుత్వం లో రాజన్న ఆలయం అభివృద్ధి లో వివక్ష కి గురి అయిందనీ,మా ప్రభుత్వం లో రాజన్న ఆలయ తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *