సిరాన్యూస్, కడెం
కడెం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రం రెడ్ జోన్ లో ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు కడెం ప్రాజెక్టు ను సందర్శించారు. అనంతరం ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో కడెం ప్రాజెక్టు మరమ్మత్తులకు సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి 9కోట్ల 46లక్షల రూపాయాలను మంజూరు చేశారన్నారు.గత పదేళ్ళలో కడెం ప్రాజెక్ట్ అభివృద్ధికి నోచుకోలేదని, బిఆర్ఎస్ హయంలో ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి విలీతే పట్టించుకోలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరమ్మత్తులు చేపట్టిందని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన వారికీ ఆడుకుంటుమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.