సిరాన్యూస్, జైనథ్
పెన్‌గంగానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన పెన్ గంగా నది పరివాహక ప్రాంతాన్ని మంగళవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈసందర్బంగా మంత్రి వెంట ఉన్న ఆదిలాబాద్ శాసన సభ సభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ వరదల వల్ల రైతులు నష్టపోయారని, నష్టపరిహారం అందించాలని, శాశ్వత పరిష్కారంగా వరదల నుండి నది తీర ప్రాంతాన్ని రక్షించడానికి కర కట్టల నిర్మాణం చేయాలని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. వరదలు తగ్గి నాక నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వచ్చి కర కట్టల నిర్మాణం గురించి కార్యాచరణ చేపడతామని అన్నారు. భారీ స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారుజ మంత్రి వెంట ఆదిలాబాద్ శాసన సభ సభ్యుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం, అడ్డి బోజారెడ్డి, కట్కం రాందాస్,నాయకులు రైతులు ఉన్నారు