జిల్లా సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్న మంత్రి , ఎమ్మెల్యే లు …

సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు

మంత్రి జూపల్లి కృష్ణారావు…

 సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ సర్వ సభ్య సమావేశంలో,జడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి ఆధ్వర్యం లో నిర్వహించిన జిల్లా సర్వ సభ్య సమావేశం లో.ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ఉదయ్ కుమార్ , జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ,ఎమ్మెల్యే డాక్టర్. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ.ఒక్కో రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రగతిని సాధిస్తున్నామని అన్నారు.విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు – భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిపారు.జిల్లావ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మాట్లాడరు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్, సంబంధిత సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా డాక్టర్, ఇంకా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు అధికారులను కోరారు.ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.రైతుబంధు’కు సంబంధించి కొందరు రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో పడడం లేదని, సమస్య ఎక్కడ ఉందో పరిష్కరించాలని సభ్యులు కోరారు.రైతుబంధుకు సంబంధించిన డబ్బులు అందరి ఖాతాల్లో పడుతాయి.కాకపోతే, కొంచెం వెనకా.. ముందు జరుగుతుందని, రైతులు కాస్త సంయమనం పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి, జడ్ పి వైస్ చైర్మన్ బాలాజి సింగ్, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్,అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాత్రికే సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *