సిరా న్యూస్,సంగారెడ్డి;
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ, సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ లో 1కోటి 56 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ను స్థానిక శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.