సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హజరయ్యారు.
తెలంగాణలో తొలిసారిగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తింపు వుంటుంది. 12 మీటర్ల పొడవుగల ఈ బస్సుల్లో 35 సీట్ల సామర్థ్యం ఉంది. ఈ బస్సుకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌలభ్యం ఉంది. 3 నుంచి 4 గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. బస్సుల్లో సెల్ ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది.