సిరా న్యూస్,భూపాలపల్లి;
ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క భూపాలపల్లి కి చేరుకున్నారు, గణపురం మండలం గాంధీనగర్ లో ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. తరువాత భూపాలపల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్ స్టోరేజ్ గదిని, డాక్టర్ క్యాంటీన్ ప్రారంభించారు. సభ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముగ్గురు మంత్రుల పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి.