సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ బీ.ఆర్.టీ.ఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ ని రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ శుక్రవారం ప్రారంభించారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ నూరు శాతం జరిగే విధంగా ఆదేశాలు ఇచ్చారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటరు పామాయిల్ సరుకులతో ముంపు ప్రాంతాలకు వాహనాలు బయలుదేరాయి