సిరా న్యూస్,నిడదవోలు;
నిడదవోలు మండలం తాళ్లపాలెం ఎర్రకాలవ ముంపు బారిన పడిన పంటలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్న నాయుడు, హోంమంత్రి అనిత, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
అచ్చం నాయుడు మాట్లాడుతూ తాళ్లపాలెం వద్ద వరద తాకిడికి గండి పడి ముంపు గురైన ప్రాంతాల్లో పరిశీలించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాల ముంపు బారిన పడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. . ముంపు బాధితుల ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి కౌలు రైతులకు ఆదుకుంటాం. గత ప్రభుత్వం కాలువలకు సంబంధించి కల్వర్టులను గాని, స్లూయిజ్లను గాని పట్టించుకోకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి దాపురించింది. యిజ్లకు కనీసం గ్రీసు కూడా పెట్టిన పాపాన పోలేదు గత పాలకులు. ఇప్పుడున్న జీవోలను తొలగించి పాత చట్టాలను తీసుకువస్తామని అన్నారు.