సిరా న్యూస్,నంద్యాల;
మీడియాతో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బాలిక కుటుంబానికి టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులు ఎంత వారైనా వదిలిపెట్టేది లేదని కచ్చితంగా వారిని శిక్షిస్తామన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కును,ఇంటి నిర్మాణం కొరకు టిడిపి ప్రభుత్వం నుంచి సహాయం చేస్తా మన్నారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బాలికా అత్యాచారం హత్య కేసులో ఎంతటి వారినైనా వదిలేది లేదు అని గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల గంజాయి అలవాటు పడి ఇలాంటి అగైత్యాలకు పాల్పడుతున్నారు అని మృతదేహం కనపడకపోవడం హృదయాన్ని కలిసి వేస్తుంది అన్నారు. బాలిక కేసులో ఇంతటి వారినైనా వదిలేదే లేదు సరైన శిక్ష పడే తీరుతుంది అని అన్నారు.ఊరికి పక్కనే కృష్ణా నది రిజర్వాయర్లు ఉండడం వలన అమ్మాయి మృతదేహం దొరికేంతవరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.