నేలకొండపల్లి బౌధ్ద స్థూపాన్ని సందర్శించిన మంత్రులు

సిరా న్యూస్,ఖమ్మం;
పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారుల తో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
బౌద్ధ స్తూపం ను పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దాం. ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారు. ముఖ్యమైన బౌద్ధ స్థూపం కి పూర్వ వైభవం తీసుకుని రావాలి. 8 ఎకరాలు ను అభివృద్ధి చేయాలి. స్థూపం కి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటు కి సమగ్ర ప్రణాళిక లు తయారు చేయాలి. బౌద్ధ స్థలాలు తక్కువ ఉన్నాయి. తెలంగాణ లో మూడు స్థలాలో పాలేరు కీలకమైనదని అన్నారు. సిబ్బంది కొరత, బడ్జెట్ లేదు అని అధికారుల వెల్లడించారు.
మంత్రి పోంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో నే మన బౌద్ధ స్థూపం కి ప్రాధాన్యత. కాంగ్రెస్ హయాంలో నే అభివృద్ధి జరిగింది. అండర్ గ్రౌండ్ లో ఇంకా స్థూపాలున్నాయి. టూరిజం లో బెస్ట్ ప్లేస్ కింద గుర్తించాలి. నేలకొండపల్లి లో భక్తరామదాసు స్థానికులు…అయన నివసించిన ఇళ్ళు ని మ్యూజియం గా ఏర్పాటు చేయాలని అన్నారు. పాలేరు నియోజకవర్గం లో రిజర్వాయర్ …కాంగ్రెస్ హాయాంలొనే అభివృద్ధి జరిగిందనిఅన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *