సిరా న్యూస్,రాయదుర్గం;
రాయదుర్గం మండల పరిధిలోని చదవడం గొల్లల దొడ్డి గ్రామంలోని, లింగాల బండపై వెలసిన పశుపతి నాథ ఆలయంలో సోమావారం అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. గ్యాస్ వెల్డింగ్ కట్టర్ తో ఇనుప డోర్లను కట్ చేసి ఆలయంలోకి చొరబడి నాలుగు దిక్కుల్లో ఉన్న నంది ముఖాలకు నల్ల బట్టను కట్టి పూజలు నిర్వహించి, పడమర ఉన్న నంది ముఖంను ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేయడం కోసం ఆలయానికి విచ్చేసిన పురోహితులు జడప్ప దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు అర్బన్ సిఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై పూజారితో ఆరా తీశారు. తరువాత క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపట్టి దుండగులు త్వరలో పట్టుకుంటామని తెలిపారు. దేశంలో నేపాల్ తర్వాత చెప్పుకోదగ్గ పశుపతినాథ ఆలయంలో ఈ ఘటన జరగడం పట్ల భక్తులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ప్రతిష్టమైన బద్రత ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావడం కాకుండా చూడాలని కోరారు