9ఏళ్ల బాలిక ను అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు
ఘాతుకానికి పాల్పడ్డ పదవ తరగతి లోపలే చదువుతున్న 15ఏళ్ళ ఉన్న మైనర్లు
నంద్యాల,సిరా న్యూస్;
ముచ్చుమర్రి లో ఆదివారం నాడు ఉదయం 9ఏళ్లు ఉన్న 5వ తరగతి చదువుతున్న వాసంతి అనే బాలిక కనబడకుండా పోయింది. దీనిపై పోలీసులకు బాలిక తండ్రి మధుసూదన్ రెడ్డి పిర్యాదు చేశారు. బాలిక జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులకు సంచలనమైన సమాచారం తెలిసింది.బాలిక ను ముగ్గురు మైనర్లు మాయ మాటలతో తీసుకేళి అత్యాచార0 చేసి హత్య చేసినట్లు ఒక మైనరు పోలీసుల ముందు అంగీకరించడంతో పోలీసులు కేసు వేగవంతం చేసి మిగిలిన ఇద్దురు ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా ముగ్గురు మైనర్లు బాలిక పై ఆత్యాచారం చేసి హత్య చేసి మాల్యాల ఎత్తిపోతల కాలువలో మృతదేహంను పడవేసినట్లు తెలిపారు.దీనితో పోలీసులు మల్యాల కాలువ వద్దకు చేరుకొని బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 15 ఏళ్లు వయస్సులోనే ముగ్గురు మైనర్లు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ0 పై బాలిక తండ్రి మధుసూదన్ రెడ్డి తీవ్రంగా అవేదన చెందుతూ నిందితులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు