అడవి పిల్లిగా నిర్ధారించిన అధికారులు
సిరా న్యూస్,హైదరాబాద్;
శుక్రవారం రాత్రి మియాపూర్లో పులి కలకలం పై ఫారెస్టు అధికారులు తెర దించారు. భవన నిర్మాణ కార్మికుడు తను పనిచేస్తున్న సమీపంలోనే చెట్ల మధ్యలోంచి సంచరిస్తున్న జంతువు వీడియోను చిత్రీకరించాడు. అది కాస్త సోషల్ మీడియా లో చిరుతగా వైరల్ కావడంతో స్థానిక మియాపూర్ పోలీసులు అప్రమత్తమై ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. శంషాబాద్ ఫారెస్టు డివిజన్ ఆఫీసర్ విజయ ఆనందరావు, మేడ్చల్ ఎఫ్ డి ఓ జానకి రామ్ లు సంఘటన స్థలానికి చేరుకొని జంతు సంచరించిన ప్రాంతంలో దాని అడుగులను పరిశీలించగా అది అడవి పిల్లి అని తేల్చారు. అది చిరుత పులి కాదని స్థానికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.