సిరాన్యూస్, కళ్యాణదుర్గం
గంగమ్మకు జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
* కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల
* బీటీపీ కాలువ పనులు పూర్తి చేస్తాం
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల జీవనాడి బీటీపీ పూర్తి స్థాయిలో నిండి ఉండటంతో ఇప్పటికే అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువన హగరి నదికి వదులుతున్నారు. గురువారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు బీటీపీ క్రస్ట్ గేట్ల వద్ద, కుడి, ఎడమ కాలువల వద్ద గంగమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం కుడి కాలువ వద్ద తూము గేటు పైకి లేపి నీటిని బ్రహ్మాసముద్రం మండలంలోని కాలువలకు ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, కాలువ శ్రీనివాసులు విడుదల చేయడం జరిగింది. ఈసందర్బంగా అమిలినేని మాట్లాడుతూ బీటీపీ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటిని వదలడం నా అదృష్టంగా బావిస్తునని అన్నారు. కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు బీటీపీ డ్యామ్ కు 2 టీఎంసీ ల నీళ్లు వచ్చాయని చాలా సంతోషాదాయకమన్నారు.