సిరా న్యూస్, సొనాల:
సర్పంచ్‌లను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సర్పంచ్‌లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘనంగా సన్మానించారు. ఆదివారం మండలంలోని పొచ్చర జలపాతం వద్ద బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల అత్మీయ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువాలతో సర్పంచ్‌లు, ఎంపిటీసీలను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.