సిరాన్యూస్, తాంసి
హస్సేన్, హుస్సేన్ దేవస్థానాలను దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో హస్సేన్, హుస్సేన్ దేవస్థానాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. గ్రామంలోని మూడు దేవస్థానాలలోని పీరీలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరి వెంట వైస్ ఎంపీపీ ముచ్చ రఘు, సర్పంచ్ అశోక్, యువ నాయకులు అభిరాం రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రీతం రెడ్డి, దేవేందర్ రెడ్డి, లక్ష్మీపతి, వెంకన్న తదితరులు ఉన్నారు.