సిరాన్యూస్, ఇచ్చోడ
రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిండ్రు : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* రహదారిపై బైఠాయింపు.. నిరసన
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రుణమాఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉందని అన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బిఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ మాజీ ఎంపీపీలు తుల శ్రీనివాస్, నిమ్మల ప్రీతంరెడ్డి, రాథోడ్ సజన్, ఇచ్చోడ బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఇచ్చోడ పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ముఖ్రా (కే) మాజీ ఎంపిటిసి గాడ్గే సుభాష్, శాంతపూర్ మాజీ సర్పంచ్ తిరుమల్ గౌడ్, చించోలి మాజీ సర్పంచ్ పాండు, కిరణ్ కుమార్ తోట వెంకటేష్, నర్వాడే రమేష్, సాబీర్, రవీందర్ రెడ్డి, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.