సిరా న్యూస్, భీంపూర్:
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు…
ప్రజా సంక్షేమం, నియోజక వర్గ అభివృద్ధే ఏకైక ధ్యేయంగా పనిచేస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విద్యా వనరుల కేంద్రాన్ని అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని అన్నారు. భీంపూర్ మండలంలో ఏండ్లుగా పాతుకుపోయి ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట ఎంపీపీ ఆర్ సంతోష్, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, తహాసీల్దార్ హరిదాస్, ఎంపీడీవో శ్రీనివాస్, నాయకులు వినోద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.