ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ కు త్వరలో శంఖుస్థాపనః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

సిరా న్యూస్,తిరుపతిః
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనమేరకు ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ కు త్వరలో శంఖుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. 2014-19 చంద్రబాబు నాయుడు పాలనలో పురాతనమైన సెంట్రల్ బస్టాండ్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారని .ఆయన తెలపారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్టాండ్ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో బస్టాండ్ నిర్మాణం జాప్యమైందని ఆయన చెప్పారు. ఎన్ హెచ్ ఎల్ ఎం ఎల్ సిఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్ట్ డైరక్టర్ పూజా మిశ్రాలను ఆదివారం సాయంత్రం ఆర్టీసి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ డిజనైస్ పై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సిఈఓ ప్రకాష్ గౌర్ ఎమ్మెల్యే కు వివరించారు. డిజైన్స్ ఆమోదించిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని సిఈఓ తెలిపారు. నవంబర్ లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చిలో నూతన బస్టాండ్ పనులకు శ్రీకారం చుట్టుతామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంమత్రిగా తిరిగి రావడంతో తిరుపతివాసుల చిరకాల వాంఛ నెరవెరనుందని ఆయన చెప్పారు. ప్రయాణికులు, భక్తులకు ఆధునాతన సౌకర్యాలతో నూతన బస్టాండ్ రూపుదిద్దుకుంటుందని ఆయన తెలిపారు. ఈ భేటిలో జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్ రెడ్డి తదిరత అధికారులు పాల్గొన్నారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *