ఉట్నూర్, సిరా న్యూస్
క్రీడలతో పాటు చదువులపై దృష్టి సారించాలి
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.
క్రీడలతో పాటు ఉన్నత చదువులపై దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ఉ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ నిర్వహించిన 7వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. కొన్ని రోజుల క్రితం ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో గెలుపొందడం హర్షణీయమన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. క్రీడలతో దేహ దారుఢ్యం పెరుగుతుందన్నారు. మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో క్రీడలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మెదడు మొద్దుబారి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.