సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు
* బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు అందజేత
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో మంగళవారం మండల కేంద్రంలో వరద తాకిడికి బిల్ కలెక్టర్ చెప్పాల పవన్ , కునారం గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన మత్స్యకారుడు గోస్కుల కుమార్ మృతి చెందగా ఎంపి గడ్డం వంశీకృష్ణా తో కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల ఎక్స్ గ్రేషియ ప్రకటించడంతో ప్రభుత్వ ద్వారా ఆర్థిక సహాయం కింద రూపాయలు 5 లక్షలు మృతుని తల్లి స్వరూప కి, కుమార్ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కులను పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ తో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అందజేశారు.అనంతరం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి తమవంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణా రావు మాట్లాడుతూఈ రాష్ట్రంలో వరదల కారణంగా పంట భూములు, ఇండ్లు, ఇతర విపత్తులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు స్పందించి స్వయంగా విపత్తులు జరిగిన చోటికి పోయి వారి బాధలు తెలుసుకుంటున్నారని అన్నారు. నేను కూడా పవన్ వరద తాకిటికి మృతి చెందిన రోజే మిర్జంపేట, కొత్త పెళ్లి, తదితర గ్రామాలను సందర్శించి గ్రామస్తుల బాధలు తెలుసుకోవడం జరిగింది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వరదను రాజకీయం చేస్తుంది అన్నారు. బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండగా పంటలు నష్టపోయిన ప్రాణాలు పోయిన ఎవరికీ ఒక్క రూపాయి ఇయ్యలేదు అన్నారు. బిఆర్ఎస్ చౌకబారు ప్రకటనలు మానుకోవాలని ఆయన అన్నారు. వరద తాకిడికి ఖమ్మం జిల్లా అతలాకుతుల మైతే మా మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే పడుకొని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు అన్నారు. వరదల విపత్తుకు ప్రాణాలు నష్టపోతే గత ప్రభుత్వంలో నాలుగు లక్షలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు పెంచింది అన్నారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ భూములలో ఇసుక మీటలు వేసిన పొలాలు, పత్తులు నష్టం జరుగుతే సంబంధిత వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరాకు పదివేల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. విపత్తులతో ప్రాణాలు పోతే పశువులకు 50,000 గొర్రెలు మేకలకు 5,000 ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే ప్రజాదరణ పొందుతున్న ఈ ప్రభుత్వాన్ని చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేని తనముతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.