సిరాన్యూస్, ఓదెల
రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యం : ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
* ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం
రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహకార సంఘం వారు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రైతన్నలను ఏకం చేస్తూ రైతుల అందరిని ఒకే వేదికపై తీసుకువచ్చే సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతుల పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి రైతులకు సహకార సంఘాలు వారదిలగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. రైతు రుణాల విషయంలో కూడా సహకార సంఘాలు ఎంతో తోడ్పడుతున్నాయని అన్నారు. రైతు సోదరులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ దే అని, రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు బోగస్ మాటలని విమర్శించారు. గత పాలకుల హయంలో రైతుల పంటల విషయంలో తరుగు పేరిట రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. ఈ వర్షాకాలపు సన్న రకం వడ్లకు రూ. 500 బొనస్ ఇస్తామని తెలిపారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సహకార సంఘం సభ్యులు, రైతులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.