సిరాన్యూస్, బోథ్
బోధ్ నియోజకవర్గ సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్యే
బోథ్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై నియోజకవర్గ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ మంగళవారం అసెంబ్లీలో గళం విప్పారు. గత ఎన్నికల సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ నిలదీసి ప్రశ్నించారు. కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే అది ఎప్పటిలోగా నిర్మిస్తారని ప్రశ్నించారు. మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా మారుస్తామని, అంతేగాక మండల కేంద్రంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫైర్ స్టేషన్ ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బరంపూర్ నుండి మూర్ఖండ్ రోడ్డుకు అటవీశాఖ క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. అంతేగాక సిరి చల్మా నుండి ఇచ్చోడ మండల కేంద్రం వరకు డబల్ రోడ్డు వేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని సిరి చర్మ లో ఉన్న పురాతన శివాలయం మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు .బరంపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఇచ్చోడ మండల కేంద్రం ను సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు లేక అర్ధాంతంగా నిలిచిపోయిందని తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని సోనాల సిరికొండ భీంపూర్ మండలాల్లో తక్షణమే ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటుచేసి పాలన పరమైన ఇబ్బందులు తొలగించాలన్నారు బజార్హత్నూర్ మండలంలోని దేగామ భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పైన మాట్లాడడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు.