సిరా న్యూస్, ఆదిలాబాద్:
అసెంబ్లీ ఎన్నికల్లో నెల రోజుల పాటు రోడ్ షోలు, ఇంటింట ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా కనిపించిన, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. ఎప్పుడూ ప్రజా క్షేత్రంలో క్షణం తీరిక లేకుండా గడిపే ఆయన ఎన్నికలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి కులాసా కబుర్లు చెప్పుకున్నారు. ఆదిలాబాద్ పట్టణం శాంతి నగర్లోని తన ఇంట్లో సతీమణి రమా, పెద్ద కుమారుడు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్, చిన్న కుమారుడు బీఆర్ఎస్ నాయకులు జోగు మహేందర్, కోడళ్లు, మనుమండ్లు, మనుమరాళ్లతో సంతోషంగా ముచ్చటిస్తూ కనిపించారు. అందరూ ఒక్క చోట చేరి, విజయ సంకేతం చూపుతూ హాయిగా నవ్వుకున్నారు.