సిరా న్యూస్, మానకొండూర్:
మొక్కలు నాటిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి మంగళవారం డా.కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో 75వ వన మహోత్సవం సందర్భంగా పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి, దాని సంర క్షణ తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే రాష్ట్రం హరిత తెలంగాణ గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.