సిరాన్యూస్,సామర్లకోట
రైల్వే ఫ్లైఓవర్ స్థలాన్ని పరిశీలించి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో కొత్తగా మంజూరైనా రెండవ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి స్థలాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, పలు శాఖల అధికారులు గురువారం పరిశీలించారు. సామర్లకోట లోని రైల్వే గేటు కారణంగా నిత్యం కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యే గా నిమ్మకాయల చిన రాజప్ప ఉన్న సమయంలో స్థానిక గాందీ బొమ్మ సెంటర్ నుంచి కాకినాడ రోడ్డులోని ఎల్ సి గేటు వరకూ నిర్మించనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గానూ ఎమ్మెల్యే పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైల్వే, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ , ఆర్ అండ్ బి, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.