సిరా న్యూస్, ఆదిలాబాద్:
అర్హులందరికి సంక్షేమ పథకాలు…
-ఎమ్మెల్యే పాయల్ శంకర్
+ యాపాల్ గూడాలో ప్రజాపాలనకు ముఖ్య అతిథిగా హాజరు…
అర్హులైన ప్రతీ ఒక్కరి సంక్షేమ పథకాలు అందేలా కృషీ చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన పలు దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు ముగిశాక కూడ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులంత ప్రజా సేవకులుగా, ప్రజాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాలని అన్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో సైతం రాజకీయాలు చేసే వారికి పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. తాను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని, అందరికి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకువెళ్తానని ఆయన అన్నారు.