సిరా న్యూస్, ఆదిలాబాద్:
హీరా సుక్కా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి…
– ఎమ్మేల్యే పాయల్ శంకర్
గోండుల ధర్మ గురు అయినటువంటి హీరా సుక్కా జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. హీరా సుక్కా జాగృతి, ఆదివాసి పర్ధాన్ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులతో కలిసి సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మల్యే మాట్లాడుతూ…. ఆదివాసి సాంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని అన్నారు. ఆదివాసి సాంప్రదాయాలను కాపాడటం తో పాటు, భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.