MLA PAYAL SHANKAR: మోడీ రాకతో ఆదిలాబాద్ లో పండగ వాతావరణం

సిరా న్యూస్, ఆదిలాబాద్:

మోడీ రాకతో ఆదిలాబాద్ లో పండగ వాతావరణం

– ఎమ్మెల్యే పాయల్ శంకర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో ఆదిలాబాద్ లో పండగ వాతావరణం నెలకొందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. సోమవారం అదిలాబాద్ పట్టణంలోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కి ఎమ్మెల్యే పాయల్ శంకర్ రామ్ లల్ల విగ్రహాన్ని బహుకరించి, ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… వెనుకబడిన జిల్లాగా పేరుందిన ఆదిలాబాద్ కు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం సంతోషకరమని అన్నారు. ఆదిలాబాద్ లో మూతపడిన సిసిఐ ఫ్యాక్టరీని తెరిపిస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని కోరారు. దీంతోపాటు టెక్స్టైల్ పార్క్ ను సైతం ఏర్పాటు చేయాలని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *