సిరా న్యూస్, ఆదిలాబాద్
రైతులకు ఇవ్వాల్సిన డబ్బులో కోతలు పెట్టవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కారణంగా రైతులకు సంబంధించిన పథకాల డబ్బులలో కోతలు పెట్టే చర్యలు లాంటివి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్లమెంట్ సభ్యులు నగేష్ సూచించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లో రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం పై నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.