సిరాన్యూస్, ఆదిలాబాద్
బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది: ఎమ్మెల్యే పాయల్ శంకర్
రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన అహంకార విధానాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మర్చిపోయి గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 ఎంపీ స్థానాలు గెలిపించి అవకాశం ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మీద విషం చిమ్మినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ శాస్తి జరిగిందో ఆ రకము వంటి శాస్తి రేపు కాంగ్రెస్ పార్టీకి జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించాలా అన్నారు. ఒక ఏజెన్సీ ఇచ్చినటువంటి సలహాలతో రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్ల రూపాయలతో హోల్డింగ్లు ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజలన్నీ అన్ని గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయం చేసిందన్నారు. పార్టీలకతీతంగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.