సిరాన్యూస్,ఆదిలాబాద్
గ్రేడ్ వన్‌గా మారిన ఆదిలాబాద్ మున్సిపాలిటీ : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం
* రూ.320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
గ్రేడ్ వన్ గా మారిన మున్సిపాలిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్ లో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ చెరువు ను మున్సిపల్ కమిషనర్ ఖామర్ అహ్మద్ , అర్బన్ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో రూ .320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతోపాటు, మంచినీటి సరఫరా కోసం ఓ హెచ్ ఎస్ ఆర్ లు ఏర్పాటు చేసి ,నెల రెండు నెలల లోపే పనులు ప్రారంభిస్తామన్నారు. అదిలాబాద్ భవిషత్తు ఖానాపూర్ చెరువు పైనే ఉందన్నారు . ఈ చెరువులో పట్టణంలోని మురికినీరు, డ్రైనేజీ నీరంతా చెరువులో కలవడంతో చెరువు అంతా దుర్గంధం అవుతుందన్నారు. నీరు నిలవాలి లేని కారణంగా భూగర్భ జలాలు కూడా రోజురోజుకు తగ్గిపోతున్నాయి అన్నారు. పూర్తిగా చెరువు కలుషితం కావడంతో దోమలు వృద్ధి చెంది పట్టణంలో వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారి పడ్తున్నారని తెలిపారు. ఆహ్లాదకరంగా డాల్సిన చెరువు మురికి నీరు చేరింత పడపోయిందన్నారు. అలాగే చెరువు సైతం ఆక్రమణలకు గురైందన్నారు. ఇది మన అందరి పట్టణం, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కొందరు అక్రమా అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలు తో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్ కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. అందరు సహకరించినప్పుడే మంచి జరగడానికి ఆస్కారం ఉందన్నారు. రూ .320 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంతోపాటు, మరింత అభివృద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు. ఖానాపూర్ చెరువు భవిష్యత్ తరాల పిల్లల కు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కృషి చేద్దామన్నారు. త్వరలో అదిలాబాద్ విమానాశ్రయం, రైల్వే లైన్ ప్రారంభమవుతుందన్నారు. ఎమ్మెల్యే వెంటా మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, లాలా మున్న, జోగు రవి, విజయ్, రత్నాకర్ ,ముకుంద్ నాయకులు ఉన్నారు.